ప్పుడు సెహ్వాగ్‌.. ఇప్పుడు కోహ్లీ

Sports
Shariff: 

ప్పుడు సెహ్వాగ్‌.. ఇప్పుడు కోహ్లీ

దిల్లీ: భారత క్రికెట్‌ జట్టు సారథి, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ ఆడే షాట్లు చూసి ఎవరైనా అభిమానులైపోవాల్సిందే. తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డీన్‌ జోన్స్‌ తాను విరాట్‌ కోహ్లీకి అభిమానినని తెలిపాడు. దూకుడుగా ఆడే అతని స్వభావం తనకెంతో ఇష్టమని చెప్పాడు.
అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైన జోన్స్‌ ప్రస్తుతం కామెంటేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘విరాట్‌ కోహ్లీ నా అభిమాన ఆటగాడు. వీరేంద్ర సెహ్వాగ్‌ స్థానాన్ని అతడు భర్తీ చేశాడు. ఎందుకంటే కోహ్లీకి ముందు నేను సెహ్వాగ్‌ అభిమానిని. దూకుడుగా ఆడే కోహ్లీ స్వభావం నాకు ఎంతో నచ్చుతుంది. ఎలాంటి పిచ్‌పైన అయినా అతడు సులువుగా పరుగులు రాబడతాడు. కోహ్లీలోని అత్యుత్తమ ఆటగాడిని కోచ్‌ రవిశాస్త్రి బయటకు తీశాడు. భవిష్యత్తులో భారత్‌ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో కూడా కోహ్లీ తన అత్యుత్తమ 


von: 
Thomas Mueller-Lupp